విధాత : కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలో చైనా అద్బుతాలు చేయడంలో ఆశ్చర్యం లేదు. అంతరిక్ష పరిశోధనలు, ఏఐ వినియోగంలో, అద్భుత సాంకేతికతతో కూడిన వంతెనలు, యుద్ద పరికరాలు..రైళ్లు, వాహనాల ఆవిష్కరణలో చైనా ప్రత్యేకత ప్రపంచ రికార్డులను అందుకుంటున్నాయి. తాజాగా చైనా వేగవంతమైన రైలు(High Speed Train) ప్రయాణంలో సరికొత్త రికార్డు(fastest train in the world)ను నమోదు చేసింది.
చైనా కొత్తగా రూపొందించిన మాగ్లెవ్ రైలు(China Maglev Train) 2 సెకన్లలోనే గంటకు 700కిలోమీటర్లు వేగంతో ప్రయాణించి కొత్త రికార్డులను సృష్టించింది. అయస్కాంత శక్తితో దూసుకెళ్తున్న అయస్కాంత శక్తితో ప్రయాణిస్తున్న ఈ టెక్ రైలు ఫ్యూచర్ ట్రావెల్‌కు గేమ్‌చేంజర్ అని నిపుణులు కొనియాడారు. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనాలో సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైలును తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించిన వారు అది సాధ్యం కాక నోరెళ్లబెట్టారు.
మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతలో రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీంతో అత్యధిక వేగాన్ని సాధించడంలో దానికి సులభమవుతుంది. ఈ రికార్డు స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది. కొత్త రైలు రాకతో బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
పర్యావరణహితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని జాతీకి గర్వకారణమైన ప్రాజెక్టుగా భావిస్తుంది. రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మాగ్లేవ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తోంది. అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. చైనా సాధించిన ఈ వేగం ఆ దేశాలను నివ్వెర పరిచినట్లుగా నిపుణులు చెబుతున్నారు.
Reporter left speechless after witnessing Japan’s new $70 million Maglev train in action at 310 mphpic.twitter.com/nexIApcmRh
— Massimo (@Rainmaker1973) November 25, 2025
