Site icon vidhaatha

Congress MLCs| కామారెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం

విధాత, హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా(Kamareddy district)లోని వరద బాధిత ప్రాంతాల్లో(flood-affected areas) కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC)ల బృందం పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం నుంచి భరోసా కల్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి(Vijayashanti), అద్దంకి దయాకర్(Addanki Dayakar), బల్మూర్ వెంకట్ (Balmur Venkat), శంకర్ నాయక్(Shankar Nayak) ల బృందం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన ఆస్తి, పంట నష్టాలను పరిశీలించింది.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తక్షణ సాయం అందించిందని.. వరద నష్టం అంచనాల నివేదికల ఆధారంగా బాధితులకు పూర్తి సహాయం ప్రభుత్వం అందిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు హామీ ఇచ్చారు.

Exit mobile version