Jabalpur Railway Station| జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఫ్యాసింజర్ పై జబర్ధస్తీ

జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఫ్యాసింజర్ పై ఓ సమోసాల వ్యాపారి చేసిన జబర్ధస్తీ వైరల్ మారింది. ఈ ఘటన రైల్వే స్టేషన్లలో వెండర్ మాఫియాకు నిదర్శనమని..దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

న్యూఢిల్లీ : జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌(Jabalpur Railway Station)లో ఫ్యాసింజర్(Passenger)పై ఓ సమోసాల వ్యాపారి చేసిన జబర్ధస్తీ(Aggressive Vendor) వైరల్ మారింది. రైల్వే స్టేషన్ లో రైలు ఆగిన సమయంలో ఓ ప్రయాణికుడు సమోసాలు కొనడానికి ఓ వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఇంతలో రైలు కదలడంతో.. సమోసాలు కొనకుండానే రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమోసాల వ్యాపారి ఆ ప్రయాణికుడిని వెళ్లనివ్వకుండా సమోసాలు కొనాలని బలవంతం చేశాడు. అతని చొక్కా పట్టుకుని ఆపి డబ్బులు కట్టి సమోసా తీసుకుంటేనే..వదులుతానని బెదిరించాడు. రైలు కదలడంతో..దానిని అందుకునే క్రమంలో మరో దారి లేక బాధిత ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో డబ్బు కట్టడానికి ఆన్ లైన్ పేమెంట్ కు ప్రయత్నించాడు.

ఆన్‌లైన్ పేమెంట్ అవ్వకపోవడంతో.. ఆ వ్యాపారి ప్రయాణికుడి చేతి వాచ్ ను బలవంతంగా తీసుకుని సమోసాలు ఇచ్చి అతడిని వదిలేశాడు. ఇంతలో రైలు వేగం పుంజుకున్న క్రమంలో ఆ ప్రయాణికుడు రైలును అందుకునేందుకు పరుగు తీశాడు. ఇదంతా ఫ్లాట్ పామ్ పైన ఉన్న ప్రయాణికులు, సిబ్బంది గమనించినప్పటికి ఆ ప్రయాణికుడికి సహాయంగా ఆ వ్యాపారి దౌర్జన్యాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రాకపోవడం విచారకరం. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఘటన రైల్వే స్టేషన్లలో వెండర్ మాఫియాకు నిదర్శనమని..దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.