పాట్నా, అక్టోబర్16 (విధాత ప్రతినిధి): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) 44 అభ్యర్థులతో చివరి జాబితాను గురువారం నాడు విడుదల చేసింది. బుధవారం నాడే 57 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును జేడీ(యూ) విడుదల చేసింది. 243 మంది అభ్యర్థులున్న బీహార్ అసెంబ్లీలో 101 అసెంబ్లీ స్థానాల్లో జేడీ(యూ) పోటీ చేస్తోంది. మరో 101 స్థానాల్లో బీజేపీ, మిగిలిన 41 స్థానాల్లో ఎన్డీఏలోని ఇతర పార్టీలకు కేటాయించారు. రెండో జాబితాలో పలువురు మంత్రులకు చోటు దక్కింది. షీలా మండల్, విజేంద్ర పప్రసాద్ యాదవ్, లేషి సింగ్, జయంత్ రాజ్, మహమ్మద్ జమాఖాన్ కు చోటు దక్కింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ఇంకా సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్నందున ఆయా అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీహార్ లో అధికారాన్ని నిలుపుకోవాలని అధికార ఎన్డీఏ పట్టుదలగా ఉంది. బీహార్ లో ఎన్డీఏను అధికారానికి దూరం చేయాలని ఇండియా కూటమి వ్యూహాప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. బీహార్ లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
JDU Releases Final Bihar Election List | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 44 మందితో జేడీ(యూ) అభ్యర్థుల జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేడీ(యూ) 44 మందితో చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 101 స్థానాల్లో జేడీ(యూ) పోటీ చేస్తోంది.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి