Nitish Kumar : ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం. ఎన్డీఏ శాసనపక్షం ఆయనను నేతగా ఎన్నుకోవడంతో గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Nitish Kumar

విధాత, హైదరాబాద్ : బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జేడీయూ అధినేత నితిశ్ కుమార్ సిద్ధమయ్యారు. బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో తమ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఎన్నుకున్నారు. దీంతో ఆయన గురువారం పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు నితీశ్ బీహార్ గవర్నర్ అరీఫ్ ఖాన్‌ను ఎన్డీఏ భాగస్వాములతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు.

బీహార్‌ కొత్త అసెంబ్లీ బుధవారం రద్దు కానుండగా, గవర్నర్ ఆహ్వానం మేరకు 75 ఏళ్ల నితీశ్ కుమార్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనన్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమచారం.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగమైన బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ (ఆర్జేవీ) 19, హామ్ 5, ఆర్‌ఎల్‌ఎం 4 స్థానాలు గెలుపొందాయి. ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసింది. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, జీవిక, ఆశా, అంగన్‌వాడీ సిబ్బందికి భత్యాల పెంపు వంటి చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మహిళల ఆర్థికవృద్ధి కోసం రూపొందించిన ‘ముఖ్యమంత్రి మహిళ రోజ్‌గార్‌ యోజన’ ద్వారా ఒక కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ.10వేల చొప్పున జమ చేసింది.

Latest News