Leopard trapped Mahabubnagar| హమ్మయ్యా..బోనుకు చిక్కిన చిరుత!

రెండున్నర నెలలుగా పాలమూరు వాసులను, అటవీ శాఖ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన చిరుత పులి ఎట్టకేలకు బోనుకు చిక్కింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కుకుంది.

విధాత, మహబూబ్ నగర్ : పాలమూరు(Palamuru)లో వాసులను, అటవీ శాఖ సిబ్బందిని రెండున్నర నెలలుగా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత పులి(Leopard capture)ఎట్టకేలకు బోనుకు చిక్కింది. పాలమూరు వీరన్నపేట, తిరుమలదేవుని గుట్ట సమీపంలో రెండున్నర నెలలుగా చిరుత సంచరిస్తూ అక్కడి ప్రజలను, రైతులను ఆందోళనకు గురి చేసింది. తరుచు గుట్ట నుంచి చిరుత బయటకు వచ్ నివాస ప్రాంతాల్లోకి రావడంతో జనానికి కంటిమీద కునుకు లేని పరిస్థితి ఏర్పడింది.

చిరుతను బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది చేసిన ప్రయత్నాలను వమ్ము కావడం మరింత సమస్యగా మారింది. డ్రోన్ తో నిఘా పెట్టిన చిరుత కదలికలను పసిగట్టడంలో గందరగోళం తప్పలేదు. ఈ క్రమంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కుకుంది. దీంతో అటు పాలమూరు వాసులు, ఇటు అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా చిరుత ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.