Leopard | ఇటీవలే క్రూర మృగాల దాడులు పెరిగిపోయాయి. అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతపులి (Leopard) దాడులు పెరిగిపోయాయి. దీంతో జనం ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు.
తాజాగా ఓ బైకర్‌పై చిరుత దాడి చేసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి రాత్రి పూట బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో రోడ్డు పక్కన చిరతు కూర్చొని ఉంది. చిరుతను గమనించని సదరు బైకర్ తన దారిలో తాను వెళ్తున్నాడు. ఇంతలో బైక్ సౌండ్‌కు చిరుత గర్జించింది. ఆ సౌండ్ విన్న బైకర్ వాహనాన్ని ఆపి వెనక్కి చూడగా చిరుత కనిపించింది.
అతడు తేరుకునేలోపే అది అతడిపైకి దూకింది (Leopard jumped on the biker). ఆ వ్యక్తి కూడా ఎంతో ధైర్యంగా దానిపై ఎదురుదాడికి దిగాడు. చిరుతను ధైర్యంగా ఎదిరించి పారిపోయేలా చేశాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు బైకర్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. అయితే, మరికొందరైతే ఇది ఫేక్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
The lion made a very dangerous attack on the biker 😱
If you were in his place , what next😱
— MrTOHA (@ishKuba) February 18, 2026
ఇవి కూడా చదవండి :
రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ తో చర్చించాం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
BRS MLAs Defection Case : తుది అంకానికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ
