Leopard | పోలీసు స్టేష‌న్‌లో చిరుత హంగామా.. వీడియో

Leopard |  ఓ చిరుత పులి( Leopard ) పోలీసు స్టేష‌న్‌లో హంగామా సృష్టించింది. అర్ధ‌రాత్రి వేళ పోలీసు స్టేష‌న్‌( Police Station )లోకి ప్ర‌వేశించిన చిరుత పులి.. అక్క‌డున్న ఓ పెంపుడు కుక్క‌( Pet Dog )పై దాడి చేసి ఎత్తుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

  • By: raj |    national |    Published on : Nov 21, 2025 9:00 AM IST
Leopard | పోలీసు స్టేష‌న్‌లో చిరుత హంగామా.. వీడియో

Leopard |  ఓ చిరుత పులి( Leopard ) పోలీసు స్టేష‌న్‌లో హంగామా సృష్టించింది. అర్ధ‌రాత్రి వేళ పోలీసు స్టేష‌న్‌( Police Station )లోకి ప్ర‌వేశించిన చిరుత పులి.. అక్క‌డున్న ఓ పెంపుడు కుక్క‌( Pet Dog )పై దాడి చేసి ఎత్తుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఉత్త‌రాఖండ్‌( Uttarakhand ) లోని నైనిటాల్( Nainital ) జిల్లా ప‌రిధిలోని బేత‌ల్‌ఘాట్‌ పోలీసు స్టేష‌న్‌( Betalghat Police Station )లోకి న‌వంబ‌ర్ 17వ తేదీ అర్ధ‌రాత్రి ఓ చిరుత పులి ప్ర‌వేశించింది. చిరుత( Leopard ) గాండ్రిపుల‌తో స్టేష‌న్‌లో ఉన్న పెంపుడు కుక్క( Pet Dog ) అప్ర‌మ‌త్త‌మైంది. పులిని ఎదుర్కొనేందుకు ఆ కుక్క ఓ అడుగు ముందుకు వేసింది. చిరుత కూడా మెరుపు వేగంతో ముందుకు దూసుకొచ్చి శునకంపై దాడి చేసి మెడ ప‌ట్టుకుంది. చిరుత దాడిలో కుక్క విల‌విల‌లాడిపోయింది. త‌ప్పించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది శున‌కానికి. చివ‌ర‌కు కుక్క‌ను చిరుత పులి అక్క‌డ్నుంచి ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పోలీసు స్టేష‌న్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

పోలీసు స్టేష‌న్ గేట్లు తెరిచి ఉంచ‌డంతోనే..

బేత‌ల్‌ఘాట్ పోలీసు స్టేష‌న్ గేట్ల‌ను న‌వంబ‌ర్ 17వ తేదీ రాత్రి తెరిచి ఉంచారు. దీంతో చిరుత లోప‌లికి ప్ర‌వేశించిన‌ట్లు అట‌వీశాఖ అధికారులు నిర్ధారించారు. అయితే చిరుత‌ను ఎదుర్కొనేందుకు పెంపుడు కుక్క శ్ర‌మించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌ర‌కు కుక్క మెడ పట్టుకుని దాన్ని అక్క‌డ్నుంచి చిరుత లాక్కెళ్లింద‌ని పేర్కొన్నారు.