Site icon vidhaatha

Mumbai Terror| ముంబైలోకి మానవ బాంబులు..బెదిరింపులతో అలర్ట్ !

విధాత : రాష్ట్రంలోకి 14మంది ఉగ్రవాదులు ప్రవేశించారని..ముంబై(Mumbai) నగరంలోని పలు ప్రాంతాల్లో మావన బాంబు దాడులు(Human Bomb) జరుపుతామన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు(Police Alert) నగరంలో విస్తృత సోదాలు చేపట్టారు. ముంబయి ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఈ బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. రాష్ట్రంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారంటూ ఆ మెయిల్ లో పేర్కొన్నారు. ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో 34వాహనాల్లో మానవ బాంబు వాహనాలు ఏర్పాటు చేశామని హెచ్చరించారు. బాంబు పేలుళ్ల కోసం 400 కిలోల ఆర్డీఎక్స్‌ తరలించినట్లు మొయిల్ లో పేర్కొన్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడుతామంటూ వచ్చిన మెయిల్ పాకిస్థాన్‌లోని ‘లష్కర్‌ ఏ జిహాదీ’ (Lashkar-e-Jihadi)ఉగ్రవాద సంస్థ ఖాతా నుంచి వచ్చిందని..మెయిల్ పంపిన వ్యక్తి తాను ఆ ఉగ్రవాద సంస్థ సభ్యుడినని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.

ముందస్తు జాగ్రత్తగా ముంబై నగరంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ముంబై సహా మహారాష్ట్ర(Maharashtra) అంతగా గణేష్ నిమజ్జోనోత్సవాల సందడి కొనసాగుతుంది. ఈ సమయంలో బాంబుదాడుల హెచ్చరికలు చోటుచేసుకోవడంతో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.

 

 

Exit mobile version