Jubilee Hills by poll | జూబ్లీహిల్స్ బైపోల్.. 170 మంది రౌడీషీటర్లు బైండోవర్.. లిస్టులో కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, సోదరుడు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు.

విధాత :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. బోరబండలో అత్యధికంగా 74 మందిని బైండోవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో రౌడీషీటర్ల కదలికపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ బై పోల్ కు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పోలీసులు బైండోవర్ చేసిన వారిలో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తంద్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు అతని సోదరుడు రమేశ్ యాదవ్ కూడా ఉండడం గమనార్హం.