న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు(Prabhakar Rao) ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంలో విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) ఈ నెల 25కు వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని..అతనిని అరెస్టు చేయరాదంటూ ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని సిట్(SIT) పిటిషన్ వేయగా… ఓ వైపు ఈ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే మరోవైపు సిట్ అధికారులు విచారణ పేరుతో వేధిస్తున్నారని..ముందస్తు బెయిల్ మంజూరు (Anticipatory Bail) చేయాలని ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణలో భాగంగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే కేసు దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించారు. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణనుఈనెల 25కి వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి కల్పించిన మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది.
