విధాత : ప్రియదర్శి( Priyadarshi), ఆనంది( Anandhi) జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’ (Premante movie teaser) నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ మూవీ కి థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. భార్యభర్తల మధ్య ప్రేమ, అనుమానాలతో వచ్చే తగదాలు, వాటి పరిష్కారంలో హీరో పడే తిప్పలతో టీజర్ ఆసక్తికరంగా నవ్వించే రీతిలో సాగింది. మూవీలో భార్యభర్తల మధ్య అపోహలు పెంచే రీతిలో వ్యవహరించే కానిస్టేబుల్ పాత్రలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ కీలక పాత్ర పోషించారు. వెన్నెల కిషోర్ కూడా తనదైన కామెడీ మార్క్ పాత్రలో నటిస్తున్నారు.
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్(Navaneeth Sriram) లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘ఇది మీకు ప్రేమ, నవ్వులు థ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండండి. ఇదిమీ హృదయాలను దోచుకుంటుంది’’ అని చిత్ర బృందం టీజర్ రీలీజ్ సందర్భంగా పేర్కొంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
