విధాత, హైదరాబాద్ : దొంగిలించబడిన మొబైల్ ఫోన్లలో రికవరీలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఏకంగా 1,00,020 దొంగిలించినఫోన్లను రికవరీ చేసి రికార్డు సృష్టించారు. దొంగిలించబడిన సెల్ ఫోన్లను రికవరీ చేసేందుకు జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్యూప్ మెంట్ ఐడెంటి రిజిస్టర్(CEIR) పోర్టల్ లో తెలంగాణ 226రోజులు ఆలస్యంగా చేరింది. ఐనప్పటికి దొంగిలించబడిన ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడం విశేషం. దొంగిలించబడిన ఫోన్ల రికవరీలో హైదరాబాద్ కమిషనరేట్ లో 84,003ఫోన్లను బ్లాక్ చేయడంతో పాటు 14,965 ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందచేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 13,360 ఫోన్లను బ్లాక్ చేసి.. 5,564 ఫోన్లను రికవరీ చేశారు. కామారెడ్డి మల్టీజోన్ 1 పరిధిలో 9,698ఫోన్లను బ్లాక్ చేసి, 3860ఫోన్లను రికవరీ చేశారు. రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలో 4,192బ్లాక్ చేసి, 2074రికవరీ చేశారు. జోగులాంబ గద్వాలలో 4,155ఫోన్లను బ్లాక్ చేసి.1998ఫోన్లను రికవరీ చేయగా..సూర్యాపేట జోన్ లో 5141ఫోన్లను బ్లాక్ చేసి..2,267ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.