Foreign Tourists | భార‌తదేశానికి.. విదేశీ పర్యాటకుల సంఖ్య డ‌బుల్‌

Foreign Tourists | గ‌త ఏడాది జనవరి-జూన్‌తో పోలిస్తే 106 శాతం వృద్ధి వెల్ల‌డించిన అధికార వ‌ర్గాలు విధాత‌:  విదేశీ ప‌ర్యాట‌కుల‌ సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. గ‌త ఏడాదితో పోలిస్తే ఫారిన్ టూరిస్టుల సంఖ్య డ‌బుల్ అయింది. జనవరి-జూన్ మధ్య కాలంలో భారత్‌కు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 2022 నాటి గణాంకాల కంటే 106 శాతం అధిక‌మ‌ని అధికారిక వర్గాలు మంగ‌ళ‌వారం తెలిపాయి. నిరుడు గణాంకాలతో పోలిస్తే 2023లో ఈ కాలానికి విదేశీ మారకం ఆదాయాలు […]

  • Publish Date - August 30, 2023 / 12:13 PM IST

Foreign Tourists |

  • గ‌త ఏడాది జనవరి-జూన్‌తో
  • పోలిస్తే 106 శాతం వృద్ధి
  • వెల్ల‌డించిన అధికార వ‌ర్గాలు

విధాత‌: విదేశీ ప‌ర్యాట‌కుల‌ సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. గ‌త ఏడాదితో పోలిస్తే ఫారిన్ టూరిస్టుల సంఖ్య డ‌బుల్ అయింది. జనవరి-జూన్ మధ్య కాలంలో భారత్‌కు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 2022 నాటి గణాంకాల కంటే 106 శాతం అధిక‌మ‌ని అధికారిక వర్గాలు మంగ‌ళ‌వారం తెలిపాయి.

నిరుడు గణాంకాలతో పోలిస్తే 2023లో ఈ కాలానికి విదేశీ మారకం ఆదాయాలు కూడా పెరిగాయి. కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం తర్వాత దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరగ‌డానికి కేంద్రం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. దేశీయ టూరిజం అభివృద్ధికి ప్రచారం కూడా క‌ల్పించింది.

ఈ సంవత్సరం జనవరి-జూన్ మధ్యకాలంలో భారతదేశానికి 43.80 లక్షల‌ మంది విదేశీ పర్యాటకులు వ‌చ్చారు. నిరుడు ఇదే కాలానికి 21.24 లక్షల మంది వ‌చ్చారు. అంటే గ‌త ఏడాదితో పోలిస్తే 106 శాతం మంది విదేశీ ప‌ర్యాట‌కులు పెరిగారు. దేశీయ పర్యాటక విషయానికి వస్తే, ఈ సంఖ్య 2021లో 677 మిలియన్లు ఉండ‌గా, 2022 నాటికి అది 1,731 మిలియన్లకు పెరిగింది.

జమ్ముక‌శ్మీర్‌కు దేశీయ పర్యాటకుల తాకిడి గ‌ణ‌నీయంగా పెరిగింది. క‌శ్మీర్‌కు 2022లో 1.8 కోట్లకు పైగా ప‌ర్యాట‌కులు రాగా, 2023 జనవరి-జూన్ మధ్య కాలంలో 1.09 కోట్లుకు పెరిగారు. వార‌ణాసిలోని కాశీ ఆల‌యాన్ని2022లో 7.16 కోట్ల మంది, 2023లో (జనవరి-మే) 2.29 కోట్ల మంది సందర్శించారని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Latest News