Site icon vidhaatha

యూట్యూబ్‌లో చూస్తూ ప్రసవం చేసుకున్న బాలిక..! ఆ తర్వాత పసిగుడ్డును గొంతు నులిమి..!

Nagpur | ఓ 15 సంత్సరాల బాలిక యూట్యూబ్‌లో వీడియో చూస్తూ సొంతంగా ప్రసవం చేసుకున్నది. ఆ తర్వాత తనకు జన్మించిన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. నాగ్‌పూర్‌లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

ఆ తర్వాత సదరు వ్యక్తి బాలికకు ఏవో మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది. నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట వద్ద ఎత్తుగా కనిపించడంతో తల్లి ఆరా తీయగా.. ఏవో ఆరోగ్య సమస్యలని చెప్పి నమ్మించింది.

ఆ తర్వాత డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్‌లో వీడియోలను చూసింది. వీడియోలను చూసి పెంచుకున్న అవగాహనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసవం చేసుకుంది. సదరు బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తనకు జన్మించిన పసికందును గొంతు నులిమి చంపడంతో ఆపటు ఇంట్లోనే ఓ డబ్బాలో మృతదేహాన్ని దాచిపెట్టింది.

ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తల్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని చూసి ఏమైందని గట్టిగా నిలదీసింది. దాంతో బాలిక అసలు విషయాన్ని తల్లికి వివరించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా బాలిక ఇంటికి చేరుకొని శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలికను గర్భవతిని చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఆరా తీస్తున్నారు.

Exit mobile version