విధాత: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఆ నియోజకవర్గంలో ధన ప్రవాహం కొనసాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. ఇక భోజనానికి విషయానికి వస్తేనే తిన్నోడికి తిన్నంత అన్నట్టు ఏర్పాట్లు చేశారు ఆయా పార్టీల నాయకులు. ఒక్కో ఓటరకు వేల రూపాయాలు ఖర్చు పెడుతున్నారు. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా నగదును భారీ స్థాయిలో పంపిణీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, నగదు, ఇతర వస్తువుల తరలింపుపై నిఘా ఉంచారు. ఉమ్మడి నల్లగొండ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా TATA సఫారీ NO.TS 02 FH 2425 కారులో రూ. కోటి నగదు పట్టుబడింది. పొలీసులు నగదును స్వాదీనం చేసుకొని సదరు వ్యక్తిని విచారించగా కరీంనగర్‌కి చెందిన 13 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ భర్త సోప్పరి వేణు తండ్రి రాజమౌళి, వయస్సు 48 తెలిపిన వివరాల ప్రకారం బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము నుంచి ఈ నగదును తీసుకొస్తూ పట్టుబడ్డారు. తదుపరి విచారణ కొరకు income tax nodal ఆఫీసర్స్ కి సమాచారం ఇచ్చారు.