Site icon vidhaatha

Ghaziabad | కారును ఢీ కొట్టిన స్కూల్ బ‌స్సు.. ఆరుగురు మృతి

Ghaziabad

విధాత‌: ఢిల్లీ-మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘ‌జియాబాద్‌లోని విజ‌య్‌న‌గ‌ర్ స‌మీపంలో మంగ‌ళ‌వారం ఉద‌యం కారును స్కూల్ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో నోయిడాకు చెందిన స్కూల్ బ‌స్సు రాంగ్ రూట్‌లో వ‌చ్చి కారును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌నలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రిని చికిత్స నిమిత్తం ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు.

Exit mobile version