Uttar Pradesh | ఓ వ్యక్తి వికృత చర్యకు పాల్పడ్డాడు. వివాహ వేడుకకు వచ్చిన ఓ 9 ఏండ్ల బాలుడిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ సిటీకి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక నిమిత్తం ఇటీవలే ఢిల్లీకి వచ్చింది. తన ఫ్రెండ్ వివాహానికి వచ్చిన ఆస్ట్రేలియా కుటుంబం.. శుక్రవారం మాసురీలోని ఆకాశ్ నగర్‌లోని పెళ్లి మండపానికి వచ్చారు.
అయితే ఆ కుటుంబానికి చెందిన ఓ 9 ఏండ్ల బాలుడిపై 34 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి కన్నేశాడు. పిల్లోడు బాత్రూమ్‌కు వెళ్లగా అతన్ని ఫాలో అయ్యి.. అక్కడ బాలుడిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. వెంటనే ఆ బాబు గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు అప్రమత్తమై బాలుడిని రక్షించారు. పోలీసులకు సమాచారం అందించి 34 ఏండ్ల వ్యక్తిని వారికి అప్పగించారు. పోలీసులు అతన్ని ఘజియాబాద్ వాసిగా గుర్తించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. జైలుకు తరలించారు.