Hebah Patel Miracle Movie Updates : మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్న “మిరాకిల్” సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొండమడుగులో మూడో షెడ్యూల్ పూర్తికాగా, చిత్రీకరణలో దాదాపు 90 శాతం పూర్తైనట్లు చిత్రబృందం తెలిపింది.

Hebah Patel Miracle Movie Updates

సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త కథాచిత్రం “మిరాకిల్” ప్రస్తుతం చిత్రీకరణలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రణధీర్ బీసు కథానాయకుడిగా కనిపించనున్నారు. సీనియర్ నటులు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

హైదరాబాద్‌కు సమీపంలోని కొండమడుగు గ్రామంలో మూడో షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, చిత్రబృందం సమక్షంలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, హీరోయిన్ హెబ్బా పటేల్, దర్శకుడు ప్రభాస్ నిమ్మల, హీరో రణధీర్ బీసు, విలన్‌గా పరిచయమవుతున్న నరేష్ నాయుడు, సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డి, నటీమణులు నవ్యశ్రీ, అక్షర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హీరోయిన్ హెబ్బా పటేల్, “మిరాకిల్ నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను. కథ చాలా వినూత్నంగా ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది” అని పేర్కొన్నారు.

సీనియర్ నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ, మంచి కథలతో వచ్చిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు. దర్శకుడు ప్రభాస్ నిమ్మల భవిష్యత్తు మరింత उज్వలంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా శ్రీరామ్, సురేష్, హెబ్బా పటేల్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. హీరో రణధీర్ బీసు, విలన్ నరేష్ నాయుడులకు ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొండమడుగు గ్రామ ప్రజలు చూపిన ఆతిథ్యాన్ని చిత్రబృందం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, సినిమా విజయవంతమైతే ఇక్కడే సక్సెస్ మీట్ నిర్వహిస్తామని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, మూడో షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని వెల్లడించారు. చివరి షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించే యోచనలో ఉన్నామని తెలిపారు. దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ఆ కృషికి తగిన ఫలితం తప్పక వస్తుందని అన్నారు.

ఈ చిత్రంలో ఆమని, నల్లా శ్రీధర్ రెడ్డి, యోగి కాత్రే, సాయిబాబా, దిల్ రమేష్, టేస్టీ తేజ, ఝాన్సీ, హర్షిత, మాస్టర్ షన్విత్, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, హైమావతి, సమీర్ దత్తా, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్, బలగం రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Ravi Teja | ఓటీటీలోకి రాబోతున్న రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”.. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్
ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

Latest News