ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ఒలంపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా రాష్ట్ర క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రేవంత్ రెడ్డి క్రీడాశాఖపై మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్(SAT) చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, శాట్ ఎండీ సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై సమావేశంలో చర్చ కొనసాగింది. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతోపాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాంచారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు.

డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి :

99 Day Prajapalana | 99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం
Warangal : క్రికెట్‌ విజయోత్సవంలో ‘మత’ విద్వేషం.. ఓ మతం జెండా పెట్టిన కొందరు.. అడ్డుకున్న మరో వర్గం