• Telugu News
  • /National

ఎలుక చేసిన పనికి షాక్..జ్యూవెలరీ షాపులో చోరీ కేసులో ట్విస్ట్

కర్ణాటకలోని తుమకూరు జ్యూవెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన బంగారు నగలు మాయమవడంతో కలకలం రేగింది. సీసీటీవీలో ఎలుక నగలను బొరియలో దాచిన దృశ్యాలు వెలుగుచూడగా, తవ్వి అన్ని నగలను స్వాధీనం చేసుకున్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 31, 2026, 2:39 pm IST
Read Time: 4 mins
ఎలుక చేసిన పనికి షాక్..జ్యూవెలరీ షాపులో చోరీ కేసులో ట్విస్ట్

ఓ జ్యూవెలరీ షాపులో నగల మాయం కేసులో ఎలుక చేసి పని అందరికి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కర్ణాటకలోని తుమకూరులో ఉన్న విశ్వాస్ జ్యూవెలరీలో రాత్రికి రాత్రే రూ.10లక్షల విలువైన 10 బంగారు ఉంగరాలు, రెండు గొలుసులు కనిపించకుండా పోవడంతో చోరీ జరిగిందని భావించారు. అయితే వేసిన తలుపులు వేసినట్లే ఉండటంతో పాటు దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు కూడా లేవు. అలాంటప్పుడు నగలను ఎవరు ఎత్తుకెళ్లారన్నదానిపై షాపు యాజమానికి తీవ్ర అయోమయం నెలకొంది. ఈ గందరగోళం నడుమ షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించిన యాజమాని అందులోని దృశ్యాలు చూసి షాక్ కు గురయ్యాడు.

రాత్రి వేళ గోడలోని చిన్న రంధ్రం గుండా నగల దుకాణంలోకి ప్రవేశించిన ఓ ఎలుక ఒక్కో నగను నోట కరుచుకుని ఎత్తుకెళ్లి దాని బొరియలో దాచి పెట్టడం సీసీ టీవీ వీడియోలలో కనిపించింది. అది చూసిన యాజమాని షాక్ కు గురయ్యాడు. ఆ ఏలుక జాడను అనుసరించి దాని బొరియను తవ్వి చూడగా అందులో మాయమైన పది ఉంగరాలు, మూడు గొలుసులు లభ్యమయ్యాయి. వాటి విలువ రూ.10 లక్షలుగా అంచనా వేస్తున్నారు. వాటిలో ఓ వజ్రాభరణం కూడా ఉంది. మొత్తం మీద దుకాణంలో నుంచి మాయమైన నగలు క్షేమంగా తిరిగి లభించడంతో ఆ యాజమాని హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. చోరీ అయ్యాయని అనుకున్న నగలన్నీ తిరిగి దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.