Mario Trailer : నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్

హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవత్సవ్ జంటగా నటిస్తున్న తెలుగు సినిమా ‘మారియో’ (MARIO) ట్రైలర్ విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ తెరకెక్కిస్తున్నారు.

Mario Trailer : నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్

విధాత : హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవత్సవ్ జంటగా నటిస్తున్న తెలుగు సినిమా ‘మారియో’(MARIO) ట్రైలర్ విడుదలైంది. ‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ నిర్మిస్తున్న ‘మారియో’ (‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్) సినిమా క్రైమ్ థ్రిల్లర్..కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో పాపులరైన ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలరించబోతున్నారు. ట్రైలర్ ఆధ్యంతం హాస్యభరితంగా సాగి సినిమా కామెడీపై హైప్ పెంచేసింది. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్‌ను విజయవంతంగా సమన్వయం చేసి సక్సెస్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారు. ముఖ్యంగా ట్రైలర్ చూస్తూ యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాగా కనిపిస్తుంది.

సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘మారియో’ చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఎంఎన్ రెడ్డి. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

Telangana Global Rising Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
Revanth Reddy : తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం