అడవుల్లో సంచరించాల్సిన కొండ చిలువ జనావాసంలోకి చేరింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఓ ఇంట్లోకి 12 అడుగుల భారీ కొండచిలువ ప్రవేశించడం కలకలం రేపింది. ఈ భారీ సర్పం మందమర్రి రెండో జోన్ గ్యాస్ గోదాం ముందు ఉన్న దుకాణం సమీపంలోని రమేశ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కనిపించింది. ఆ కొండ చిలువ సుమారు 12 అడుగుల పొడవు ఉంది. చక్కని మేని ఛాయతో..చురుగ్గా ఉన్న కొండ చిలువను చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై, వెంటనే పాములు పట్టే వ్యక్తి మహేందర్ కు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న మహేందర్ అతి కష్టం మీద ఆ భారీ కొండ చిలువను పట్టుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు ఈ భారీ ఆకారంలో ఉన్న కొండ చిలువను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు ఆ కొండచిలువను సురక్షితంగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. మందమర్రి రెండో జోన్ జనావాసం అటవీ సరిహద్దు ప్రాంతం కావడంంతో అడపా దడపా ఇక్కడకు భారీ సరసృపాలు, వన్యప్రాణులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.
What’s breakfast today?
Early morning guest visits a mandamarry house. pic.twitter.com/aFd8T2eUAS
— SRINIVASA RAO🦉 (@NeverSayYesDude) July 31, 2026