Miracle Telugu movie| “మిరాకిల్” సినిమా ” షూటింగ్ లో హెబ్బా పటేల్
యాక్షన్ ఎంటర్టైనర్‌లకు మళ్లీ జోష్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది “మిరాకిల్” సినిమా. దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమయ్యే మూడో షెడ్యూల్‌లో ఆమె షూటింగ్‌లో పాల్గొననుంది.
యాక్షన్ ఎంటర్టైనర్‌లకు మళ్లీ జోష్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది “మిరాకిల్” (Miracle Telugu movie) సినిమా. దర్శకుడు ప్రభాస్ నిమ్మల (Director Prabhas Nimmala ) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ (Hebbah Patel) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమయ్యే మూడో షెడ్యూల్‌లో ఆమె షూటింగ్‌లో పాల్గొననుంది.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి కాగా, తాజా షెడ్యూల్‌తో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.
హీరోగా రణధీర్ భీసు నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు శ్రీరామ్, సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర ప్రతినాయకుడిగా పరిచయం అవుతుండగా, ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నిర్మాతల మాటల్లో… “’సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నిమ్మల ఈసారి ‘మిరాకిల్’తో మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. హెబ్బా పటేల్ గ్లామర్, సీనియర్ నటుల పాత్రలు, ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ సినిమాకు హైలైట్ అవుతాయి. ఫిబ్రవరి 24 నుంచి మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది” అని తెలిపారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే… సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, ఎడిటింగ్: విశ్వనాధ్, సాహిత్యం: రాంబాబు గోసాల, ఫైట్స్: శ్రీను. సహనిర్మాతగా శ్రీమతి జ్యోత్స్న వ్యవహరిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను ప్రభాస్ నిమ్మల స్వయంగా నిర్వహిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram