Independence Day | ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. వరుసగా పదో సారి

Independence Day | 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది పదోసారి. ఇంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ పాలనలో సమయంలో వరుసగా పదిసార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని అంతకు ముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకోగా.. […]

  • Publish Date - August 15, 2023 / 02:27 AM IST

Independence Day |

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది పదోసారి.

ఇంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ పాలనలో సమయంలో వరుసగా పదిసార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని అంతకు ముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకోగా.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాయుసేన హెలికాపటర్లు పుష్పవర్షం కురిపించాయి.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్రమంత్రులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ హాజరయ్యారు. ఈ సారి వేడుకలకు కేంద్రం విశిష్ట అతిథులను ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్రం ఆహ్వానం పలికింది.

అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న ప్రధాని త్వరలోనే అక్కడ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉందని, ప్రజలు ఈ శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

శాంతి ద్వారానే దేశం వృద్ధి చెందుతుందని, శాంతిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతాయని చెప్పారు.

Latest News