YS Sharmila| చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే: వైఎస్ షర్మిలా రెడ్డి

విధాత, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని(Democracy) ఖూనీ చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu), మాజీ సీఎం వైఎస్.జగన్(YS Jagan Mohan Reddy)లు ఇద్దరు ఒకటేనని..నాడు కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే..నేడు పులివెందులలో చంద్రబాబు అదే చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief), వైఎస్.షర్మిల(YS Sharmila) విమర్శించారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరు కూడా ప్రధాని […]

విధాత, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని(Democracy) ఖూనీ చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu), మాజీ సీఎం వైఎస్.జగన్(YS Jagan Mohan Reddy)లు ఇద్దరు ఒకటేనని..నాడు కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే..నేడు పులివెందులలో చంద్రబాబు అదే చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief), వైఎస్.షర్మిల(YS Sharmila) విమర్శించారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరు కూడా ప్రధాని మోదీ కోసం పని చేస్తున్న వాళ్లేనని..ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అంతే తేడా అని విమర్శించారు. ఓటు చోరీపై మోదీని చంద్రబాబు, జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

మోదీ తన పాలనలో దేశాన్ని నయా భారత్ అంటున్నారని..కాని దేశం మోదీ చేతిలో దగా పడ్డ భారత్ అని షర్మిల వ్యాఖ్యానించారు. మోదీ చెర నుంచి దేశాన్ని విడిపించే మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టి, ఆర్ఎస్ఎస్ రాజ్యాగాన్ని అమలు చేయడమా నయా భారత్ అంటే అని షర్మిల ప్రశ్నించారు.