విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరెటరీ) కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంచలనంగా మారింది. అగ్ని ప్రమాదంతో చెలరేగిన మంటల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది అప్రమత్తమై కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు.
కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇదే భవనంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే 5 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని.. మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Sajjanar warning on reels| ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!: సజ్జనార్ ట్వీట్ వైరల్
India US interim trade deal| భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఫిక్స్
