విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు(కేకే) కుమారుడు వెంకటేశ్వర్ రావుకు బెదిరింపుల వ్యవహారం కలకలం రేపింది.
బంజారాహిల్స్‌లో స్థల వివాదం వ్యవహారంలో రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులు వచ్చాయి. దీనిపై బాధితుడు వెంకటేశ్వర్ రావు బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డితో పాటు అన్వేష్ రెడ్డిపై బంజారాహిల్స్ ఆయన ఫిర్యాదు చేశారు. తమ నివాస స్థలాల విషయంలో వారిద్దరు కూడా బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 3కోట్లు ఇస్తే భూములపై కేసు ఉపసంహరించుకుంటామని ఫోన్ చేశారని తెలిపారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో రఘువీర్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
