కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా..లేఖ విడుదల
కాంగ్రెస్‌కు టి. జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ 40ఏళ్ల అనుబంధాన్ని ముగించారు.
విధాత : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జీవన్ రెడ్డితో పాటు 1500మంది నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీకి గుడ్ బై కొట్టారు. కాంగ్రెస్ పార్టీతో 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని తెంచుకుంటు జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన మద్దతుదారులతో కూడిన సమావేశంలో జీవన్ రెడ్డి తన రాజీనామా లేఖను విడుదల చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు
నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారాతాడు అనుకుంటున్నాను అని జీవన్ రెడ్డి తన రాజీనామా సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవమానాలు, అన్యాయాలపై ఎంతకాలం ఓపిక పట్టాలి…నేను కనీసం మంత్రి పదవికి అర్హుడని కాదా…వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం అవసరమా అని ప్రశ్నించారు. ఇంకెంతకాలం ఎంతమందిని తొక్కుకుంటూ పోతారాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో చంద్రబాబు, కేసీఆర్ తో పోరాటం చేశానని, ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోరాటం కొనసాగిస్తానన్నారు. జగిత్యాలలో నన్ను అణిచివేయాలని కుట్ర చేశాడని ఆరోపించారు. నాకు ఏ గుర్తింపు రాకుండా అణిచివేయాలని చూస్తున్నారన్నారు. నాకు పార్టీ మారే ఆలోచన లేదని.. ఈ వయసులో పార్టీ మారి ఏం చేస్తానని ఆలోచించానని..అయితే ఇంకా ఎంత కాలం ఓపిక పట్టాలని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీలో తలదూర్చకుండా చూడాలని కోరానని దానిపై వారు మౌనం వహించారని తెలిపారు. నా సహచరుడు, కుటుంబ సభ్యుడి వంటి నాయకుడిని నడి బజార్ లో హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :
పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్స్ వచ్చేస్తున్నాయ్ !
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram