Health Tips | మధ్యాహ్నం( afternoon ) లంచ్ అయ్యాక చాలా మంది నిద్ర( Sleep )లోకి జారుకుంటారు. కాసేపు కునుకు తీస్తే తప్ప వారికి రిలాక్స్ ఉండదు. లేదంటే అలసటగా ఉండి.. నీరసంగా మారిపోతారు. ఈ సమస్య చాలా మంది ఉంది కూడా. మరి రాత్రి కంటి నిండా నిద్ర పోయాక కూడా మళ్లీ మధ్యాహ్నం నిద్ర ఎందుకు వస్తుందంటే దానికి ప్రధాన కారణం డి విటమిన్( Vitamin D ) లోపమే అని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు.
మధ్యాహ్నం వేళ అలసట ఎందుకు వస్తుంది..?
డి విటమిన్ లోపం నేరుగా కండరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇది మూడ్, శక్తిని నియంత్రించే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. మధ్యాహ్నం సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి సహజంగా తగ్గుతుంది. విటమిన్ డి లోపం ఉంటే.. శరీరం ఈ మార్పును సమతుల్యం చేయలేకపోతుంది. నీరసం ఎక్కువ అవుతుంది. దీనితో పాటు, వాపు పెరగడం వల్ల నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది.
శరీర కణాలు సరిగ్గా పని చేయవు..
విటమిన్ డీ ఎముకలకు మాత్రమే కాకుండా.. శరీరంలో శక్తి స్థాయిని నిర్వహించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల శరీర కణాలు సరిగ్గా పనిచేయవు. దీనివల్ల రోజు మధ్యలో ఒక్కసారిగా అలసట అనిపిస్తుంది. సాధారణంగా విటమిన్ డీ ఆరోగ్యకరమైన స్థాయి 20 నుంచి 50 ng/mL మధ్య ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి దీనికంటే చాలా తక్కువ స్థాయిలో విటమిన్ డి ఉంటుంది.
మధ్యాహ్న నిద్ర రాకూడదంటే ఏమి చేయాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎక్కువ నిద్రపోవడం సరిపోదు. వైద్య సలహా తర్వాత విటమిన్ డి సప్లిమెంట్స్, సమతుల్య ఆహారం, లంచ్ తర్వాత కొద్దిగా నడవడం, క్రమం తప్పకుండా ఎండలో ఉండటం వల్ల మధ్యాహ్న నిద్ర సమస్య దూరమవుతుంది. తిరిగి శక్తిని పొందుతారు.
