అమరావతి : తిరుపతిలో శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి(Chevireddy Madhusudhan Reddy) ఇంటిపై దుండగుల దాడి సంచలనం రేపింది. వైసీపీ నేత చెవిరెడ్డి తల్లిదండ్రుల(parents)పై దుండగుల దాడి చేశారు. దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి మరణించగా(mother dead)..తండ్రి మహదేవ రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి(father seriously injured). ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయంగా ఈ దాడి కలకలం రేపింది.
దాడికి పాల్పడిన దుండగులు ఎవరు..దొంగతనానికి వచ్చి దాడి చేశారా లేక రాజకీయ పరంగా మధుసూధన్ రెడ్డిపై దాడి చేసేందుకు వచ్చి..తల్లిదండ్రులపై దాడిచేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి వార్త తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నాయి. వైసీపీ స్థానిక నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని మధూసూధన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు.
