Bengaluru traffic problems | మన దేశంలో ట్రాఫిక్ (traffic problems) జామ్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరమే. వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరుది దేశంలోనే మొదటి స్థానం. అక్కడ స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ట్రాఫిక్ సమస్యల్లో తాజాగా ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించింది (Bangalore sets world record in traffic problems).
ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు రెండోస్థానంలో నిలిచింది. ‘టామ్ టామ్ గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025′ (TomTom Traffic Index 2025) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా మెక్సికో సిటీ (Mexico City) మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో బెంగళూరు ఉంది. అంతకు ముందు ఏడాది బెంగళూరు మూడోస్థానంలో నిలిచింది. ఇప్పుడు రెండోస్థానంలోకి రావడం అక్కడి ట్రాఫిక్ పరిస్థితికి అద్ధం పడుతోంది.
సగం జీవితం ట్రాఫిక్‌లోనే..
బెంగళూరు వాసులు తమ జీవితంలో సగం సమయం ట్రాఫిక్‌లోనే గడుపుతున్నట్లు సదరు నివేదిక తెలిపింది. ఇక్కడ సగటు వేగం గంటకు కేవలం 16.6 కిలోమీటర్లు మాత్రమేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓ వాహనదారుడు కేవలం 4.2 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి సగటున 15 నిమిషాల సమయం కేటాయించాల్సి వస్తోంది. అంటే నగరవాసులు తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని రోడ్లపైనే గడుపుతున్నారు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు..
గత బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గార్డెన్ సిటీగా మొన్నటివరకూ ముద్దుగా పిలుచుకొన్న బెంగళూరు నగరాన్ని నేడు సమస్యలకు కేరాఫ్‌గా పిలుస్తున్నారు. రోడ్డెక్కితే ట్రాఫిక్ కష్టాలు. నరకానికి చిరునామాగా బెంగళూరు మారిపోయిందంటూ ప్రముఖులు సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
టాప్ 5లో పూణె..
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల జాబితాలో భారత్‌కు చెందిన మరో నగరం కూడా చోటు దక్కించుకుంది. పూణే (Pune) ఇప్పుడు ఐదవ స్థానంలో ఉంది. పూణె వాసులు దాదాపు 160 గంటల పాటూ ట్రాఫిక్‌లోనే తమ సమయాన్ని గడిపినట్లు తేలింది.
ఇవి కూడా చదవండి :
Health Tips | మధ్యాహ్నం నిద్ర వస్తుందా..? ఆ విటమిన్ లోపమే కారణమట..!
India US interim trade deal| భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఫిక్స్
