Site icon vidhaatha

Viral | తాచుపామును మింగిన చేప‌.. క్ష‌ణాల్లోనే రెండూ చ‌నిపోయాయి..

Viral సాధార‌ణంగా పాములు క‌ప్ప‌ల‌ను, చిన్న చిన్న చేప‌ల‌ను మింగేస్తుంటాయి. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను చాలానే చూసి ఉంటాం.. కానీ చేప పామును మింగడం చూసి ఉండం.

అయితే ఓ చేపా తాచుపామును మింగేసింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా దంతాల‌ప‌ల్లి మండ‌లం ల‌క్ష్మీపురంలో ఆదివారం వెలుగు చూసింది.

ల‌క్ష్మీపురం గ్రామ శివారులోని పాలేరు వాగు చెక్‌డ్యాం వ‌ద్ద వాలుగ ర‌కానికి చెందిన చేప‌.. తాచుపామును నోట చిక్కించుకుంది. పామును మింగేస్తూ చేప‌, విడిపించుకునేందుక పాము ప్ర‌య‌త్నించాయి.

ఈ రెండు నీటిలో పోరాడుతున్న దృశ్యాల‌ను గ్రామ‌స్తులు చూసి షాక్ అయ్యారు. క్ష‌ణాల్లోనే అవి రెండూ చ‌నిపోయి ఒడ్డుకు చేరాయి.

చేప నుంచి పొడ‌వైన తాచుపామును బ‌య‌ట‌కు లాగారు గ్రామ‌స్తులు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Exit mobile version