Site icon vidhaatha

Tirumala | తిరుమ‌ల‌లో బాలిక‌ను చంపిన చిరుత చిక్కింది..

Tirumala |

రెండు రోజుల క్రితంలో తిరుమ‌ల కొండ‌పై ఓ ఆరేండ్ల బాలిక‌పై చిరుత దాడి చేసి చంపిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బాలిక మృత‌దేహం ల‌భించిన స్థ‌లంతో పాటు చుట్టుప‌క్క‌ల మూడు బోన్ల‌ను ఏర్పాటు చేశారు.

తిరుమ‌ల – అలిపిరి న‌డ‌క‌మార్గంలోని ఏడో మైలు వ‌ద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమ‌వారం తెల్ల‌వారుజామున చిరుత చిక్కింది. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టిన అధికారులు.. చిరుత చిక్కిన ప్రాంతానికి చేరుకుని ప‌రిశీలిస్తున్నారు.

శుక్ర‌వారం నెల్లూరు జిల్లాకు చెందిన ల‌క్షిత‌(6) అనే చిన్నారి త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి అలిపిరి న‌డ‌క‌మార్గంలో వెళ్తుండ‌గా చిరుత దాడి చేసి చంపింది.

గ‌తంలోనూ ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుత‌ను బంధించి క‌ల్యాణ ట్యాంక్ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో వ‌దిలిపెట్టారు. చిరుత‌ల దాడుల నేప‌థ్యంలో టీటీడీ అప్ర‌మ‌త్త‌మైంది. మ‌ధ్యాహ్నం త‌ర్వాత చిన్నారుల‌తో క‌లిసి న‌డ‌క మార్గంలో వెళ్లొద్ద‌ని టీటీడీ ఆదేశించింది.

Exit mobile version