Site icon vidhaatha

Chandrababu | చంద్ర‌బాబు కాన్వాయ్ నంబ‌ర్ ‘393’.. ఈ నెంబ‌ర్ వెన‌కున్న ర‌హ‌స్యం ఏంటో తెలుసా..?

Chandrababu | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు బుధ‌వారం ఉద‌యం 11.27 గంట‌ల‌కు ప్ర‌మాణం చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కొత్త కాన్వాయ్ సిద్ధ‌మైంది. మొత్తం 11 వాహ‌నాల‌తో బాబు కాన్వాయ్ సిద్ధం చేశారు ప్రోటోకాల్ అధికారులు. ట‌యోటా కంపెనీకి చెందిన బ్లాక్ క‌ల‌ర్ వాహ‌నాల‌కు 393 నంబ‌ర్ ప్లేట్ల‌ను అమ‌ర్చ‌రారు. చంద్ర‌బాబు కాన్వాయ్‌కు ద‌శాబ్దాలుగా ఇదే నెంబ‌ర్ కొన‌సాగుతోంది. ఇంత‌కీ ఈ సంఖ్య ఎందుకంత సెంటిమెంట్..? ఈ నెంబ‌ర్ వెన‌కున్న ర‌హ‌స్యం ఏంటి..? ఇప్పుడు ఈ నంబ‌ర్‌పైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. 393 నెంబ‌ర్ విష‌యంలో అలిపిరి ఘ‌ట‌న‌ను కూడా గుర్తు చేస్తున్నారు. మ‌రి ఆ నెంబ‌ర్‌కు ఉన్న ప్రాధాన్య‌త ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

దేవ‌దూత సంఖ్య – 393..

న్యూమరాలజీ ప్రకారం 393ని ఏంజెల్ నెంబర్ అంటారు. నెంబర్ 3 సృజనాత్మకత, స్వీయ-వ్యక్తీకరణ, సానుకూల శక్తిని సూచిస్తుంది. నెంబ‌ర్ 9.. ఆధ్యాత్మిక మేల్కొలుపుకి ప్రతీకగా చెబుతారు. అందుకే 393ని దేవదూత సంఖ్య అంటారు. అంటే మీ లక్ష్యాలను చేరుకునేందుకు మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నారని , ఇదే విశ్వాసంతో ముందుకు సాగితే మీకు అవసరమైన దైవిక శక్తి లభిస్తుందని న‌మ్మ‌కం. ఒకవేళ మీ మార్గంలో కష్టం ఎదురైనా దానని అధిగమించేందుకు అవసరం అయిన శక్తి లభిస్తుందని ఈ సంఖ్య వెనుకున్న ఆంతర్యం. ఇదంతా సాధ్యం కావాలంటే ముందు మీలో సానుకూల ఆలోచనలు ఉండాలి…ఏం కోరుకుంటున్నారో ఏ ఏ మంచిపనులు చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా ఉండాలి..దానికి సాధించాలనుకున్న మీ సామర్థ్యాన్ని మీరు విశ్వశించాలి…ఇలాంటప్పుడు స్వయంగా భగవంతుడు మీ ప్రయాణంలో తోడుంటాడని ఈ నెంబర్ ఆంతర్యం.

నెంబ‌ర్ 3.. గురు గ్ర‌హానికి సూచ‌న‌

మూడో నెంబర్ గురుగ్రహానికి సూచన.. గురువు అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని మరో ఆంతర్యం. పైగా 3తో మొదలై కామన్ పవర్ ఫుల్ నెంబర్‌గా చెప్పే 9.. ఆ తర్వాత మళ్లీ 3తో ఎండ్ అవుతోందంటే మరింత లక్కీ అని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మ‌రి చంద్రబాబుకు ఎందుకంత‌ ప్రత్యేకం..!

ఆంధ్రప్ర‌దేశ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్న చంద్ర‌బాబుకు న్యూమరాలజీ ప్రకారం లక్కీ నెంబర్ 6. కొత్త కాన్వాయ్‌లోని 3, 9, 3.. మొత్తం 15.. ఈ రెండూ కలిపితే 6. ముఖ్యంగా వాహనాల విషయంలో లక్కీ నెంబర్ అనుసరించడం ఎంత అవసరం అంటే ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలిపిరి సంఘటన గురించి ప్రస్తావించారు. ఎప్పుడూ తన లక్కీ నెంబర్ 6 కలిసొచ్చే 393 వాహనంలో ప్రయాణించే చంద్రబాబు.. అలిపిరి ఘటన జరిగిన సమయంలో మాత్రం 4021 నెంబర్ కారులో ఉన్నారు. ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఏడుకొండలవాడి ఆశీర్వాదమే అయినప్పటికీ.. అప్పుడు కూడా 393 కారులో ప్రయాణించి ఉంటే అసలు ప్రమాదం బారినే పడకుండా ఉండేవారేమో అనే ప్రచారమూ జరిగింది. ఈ సెంటిమెంట్స్‌ని ఎవరు ఎంతవరకూ విశ్వశిస్తారన్నది పూర్తిగా వారి వ్యక్తిగతమే అయినా…అభిమానులు కూడా చాలా సందర్భాల్లో ఈ సెంటిమెంట్స్ చూస్తారు. అయితే కేవలం ఈ నెంబర్ చంద్రబాబుకి మాత్రమే కాదు..ఎవరికైనా మంచి ఫలితాలనే ఇస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version