Siddipeta | ఓ వివాహితతో విద్యార్థికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి( Extramarital affair ) దారి తీసింది. అయితే సదరు మహిళ మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి విద్యార్థి( Student ) తట్టుకోలేకపోయాడు. దీంతో తన సొంతూరికి వెళ్లిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య( Suicide ) చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా( Siddipeta Dist ) కుకునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్(19) హైదరాబాద్( Hyderabad )లోని ఓ కాలేజీలో డిగ్రీ( Degree ) చదువుతున్నాడు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు.. సుచిత్ర( Suchitra ) ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. అయితే అదే షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్న వివాహితతో విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే గత కొంతకాలం నుంచి ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఆమె అలా ఉండడం అభిషేక్‌కు నచ్చలేదు. మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఈ నెల 17వ తేదీన అభిషేక్ తన సొంతూరికి వెళ్లి పురుగుల మందు తాగాడు. అతన్ని తల్లిదండ్రులు గమనించి, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.