Site icon vidhaatha

Nalgonda: సర్కార్ ఆసుపత్రి నిర్వాకం! ఆసుపత్రి బాత్ రూమ్‌లో మహిళ ప్రసవం

విధాత: నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంతో గర్భిణీ మహిళ బాత్రూంలో ప్రసవించిన ఘటన చోటుచేసుకుంది. రెండో కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళకు డెలివరీకి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

డాక్టర్ల అంచనాకు భిన్నంగా బాత్ రూమ్ కు వెళ్ళిన మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చి అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది పుట్టిన శిశువును ఐసీయూకి తరలించి పర్యవేక్షణలో ఉంచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version