Site icon vidhaatha

సినీ క‌ళామ్మత‌ల్లికి ‘నుదుట తిల‌కం’ కాంతారావు: సీఎం కేసీఆర్‌

విధాత: నాటి తరం ప్రఖ్యాత నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99 వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. త‌న సినీ జీవిత ప్ర‌యాణంలో 400 వందలకు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించారని కొనియాడుతూ సినీ కళారంగానికి కాంతారావు చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

తెలుగు సినీ కళామ్మతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కండ్లయితే ‘నుదుట తిలకం’గా కాంతారావు ఖ్యాతి గడించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు.

Exit mobile version