అదానీకి మ‌ళ్లీ భంగ‌పాటు

-డీబీ ప‌వ‌ర్‌ను కొన‌లేక‌పోతున్న‌ అదానీ ప‌వ‌ర్‌ -ఈసారీ ముగిసిన ఎంవోయూ గ‌డువు తేదీ విధాత‌: గౌత‌మ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. డీబీ ప‌వ‌ర్ లావాదేవీ మ‌ళ్లీ విఫ‌ల‌మైంది. రూ.7,017 కోట్ల‌తో డీబీ ప‌వ‌ర్‌ను ద‌క్కించుకోవాల‌ని అదానీ ప‌వ‌ర్ దాదాపు 6 నెల‌లుగా తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నది. అయిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాన్ని మాత్రం అందుకోలేక‌పోతున్న‌ది. గ‌త ఏడాది ఆగ‌స్టు 18న ఇరు సంస్థ‌ల మ‌ధ్య ఈ లావాదేవీకి సంబంధించి ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. […]

  • Publish Date - February 16, 2023 / 05:48 AM IST

-డీబీ ప‌వ‌ర్‌ను కొన‌లేక‌పోతున్న‌ అదానీ ప‌వ‌ర్‌
-ఈసారీ ముగిసిన ఎంవోయూ గ‌డువు తేదీ

విధాత‌: గౌత‌మ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. డీబీ ప‌వ‌ర్ లావాదేవీ మ‌ళ్లీ విఫ‌ల‌మైంది. రూ.7,017 కోట్ల‌తో డీబీ ప‌వ‌ర్‌ను ద‌క్కించుకోవాల‌ని అదానీ ప‌వ‌ర్ దాదాపు 6 నెల‌లుగా తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నది. అయిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాన్ని మాత్రం అందుకోలేక‌పోతున్న‌ది.

గ‌త ఏడాది ఆగ‌స్టు 18న ఇరు సంస్థ‌ల మ‌ధ్య ఈ లావాదేవీకి సంబంధించి ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. ఎంవోయూ ప్ర‌కారం నిరుడు అక్టోబ‌ర్ 31లోగానే లావాదేవీ పూర్తి కావాల్సి ఉన్న‌ది. అయిన‌ప్ప‌టికీ గ‌డువును న‌వంబ‌ర్ 30కి పొడిగించారు. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 31కి, ఆపై ఈ ఏడాది జ‌న‌వ‌రి 15కు, ఈ నెల 15కు కూడా పెంచారు.

అయిన‌ప్ప‌టికీ డీబీ ప‌వ‌ర్‌ను అదానీ ప‌వ‌ర్ హ‌స్త‌గ‌తం చేసుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈసారీ డీల్ గ‌డువు దాటిపోయింది. ఫ‌లితంగా ఈ లావాదేవీ మ‌రోమారు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే హిండెన్ బ‌ర్గ్ రిసెర్చ్ నివేదిక నేప‌థ్యంలో ఈ ప‌రిణామం అత్యంత ప్రాధాన్యత‌ను సంత‌రించుకున్న‌ది. హిండెన్ బ‌ర్గ్ దెబ్బ‌కు అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కేవ‌లం 3 వారాల్లో ఏకంగా 120 బిలియ‌న్ డాల‌ర్ల‌కుపైగా హ‌రించుకుపోయిన విష‌యం తెలిసిందే.

Latest News