Adilabad | ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిండుతున్న జలాశయాలు

Adilabad విధాత‌: గత నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ఆయా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. తాంసి మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఆ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.5 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 275.90 […]

  • Publish Date - July 23, 2023 / 01:20 PM IST

Adilabad

విధాత‌: గత నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ఆయా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. తాంసి మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఆ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.5 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 275.90 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టుకు మొత్తం ఐదు గేట్లు ఉండగా రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అటు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లను కూడా పైకి ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు జలకళలాడుతున్నది. వరద ప్రభావం పెరగడంతో అధికారులు ఒక గేట్ ఎత్తి 5000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1173 అడుగులుకు ఉంది.

భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు కూడా జల కళను సంతరించుకుంది. జిల్లాలోని ప్రధాన జలాశయమైన కడెం ప్రాజెక్టులో వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 686.925అడుగుల వద్ద ఉంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వరద తగ్గు ముఖం పట్టింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.175 టీఎంసీల సామర్థ్యానికి గాను 14. 99 టీఎంసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 72788 క్యూసెక్కులు వస్తుండగా.. ప్రాజెక్టులోని 12 గేట్లు ఎత్తి 86816 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

Latest News