Site icon vidhaatha

యాదగిరిగుట్ట: అల వైకుంఠపురం.. యాదాద్రి ఆలయం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల పర్వం కన్నుల పండుగగా సాగుతుంది. ఒకవైపు స్వామివారి అలంకార, వాహన సేవలతో ఆలయ ప్రాంగణం భక్తజన కోలాహలంతో కళకళలాడుతుంది. ఇంకోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల సందడితో అద్భుత శిల్పకళా శోభాయమానమైన యాదగిరీషుడి ఆలయం నృత్య కళా ప్రదర్శనలతో కనువిందు చేస్తుంది.

గురువారం రాత్రి శ్రీ ఉమామహేశ్వరి బృందం ఆధ్వర్యంలో 100 మంది కూచిపూడి విద్యార్థినుల నృత్య ప్రదర్శన లక్ష్మీ నరసింహ ఆలయాన్ని అలా వైకుంఠపురం అనిపించేలా కళాత్మకంగా సాగింది. అనంతరం టికె సిస్టర్స్ సరోజ, సుజాతల ఆధ్వర్యంలో కర్ణాటక గాత్ర కచేరి, శ్రీ సాయి బృందం వారిచే మోర్సింగ్ వాయిద్య కచేరి నిర్వహించారు.

స్వామివారి బ్రహ్మోత్సవ పర్వాల ఆధ్యాత్మిక ఘట్టాలు… ఇటు ధార్మిక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలతో యాదగిరిగుట్ట కొండంతా ఆధ్యాత్మిక సాంస్కృతిక పరిమళాలతో శోభయమానంగా వెలిగిపోతుండగా, రంగురంగుల విద్యుత్ దీప కాంతుల అలంకరణ ల తళకులతో యాదగిరిగుట్ట క్షేత్రం నవ వైకుంఠంగా కాంతులీనుతూ కనువిందు చేస్తుంది.

Exit mobile version