Telangana | మందుబాబుల‌కు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో త‌గ్గిన మ‌ద్యం ధ‌ర‌లు

Telangana | మందు బాబుల‌కు తెలంగాణ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో బీర్‌ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ధ‌ర‌ల భారంతో మ‌ద్యానికి దూర‌మైన మందు బాబులు ఇక వైన్ షాపుల ఎదుట క్యూ క‌ట్ట‌నున్నారు. 180 మిల్లీ లీట‌ర్ల బాటిల్‌పై రూ. 10, 375 మి.లీ. బాటిల్‌పై రూ. 20, 90 మి.లీ. బాటిల్‌పై రూ. 10, 750 మి.లీ. బాటిల్‌పై రూ. 40 […]

  • Publish Date - May 5, 2023 / 01:55 PM IST

Telangana | మందు బాబుల‌కు తెలంగాణ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో బీర్‌ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ధ‌ర‌ల భారంతో మ‌ద్యానికి దూర‌మైన మందు బాబులు ఇక వైన్ షాపుల ఎదుట క్యూ క‌ట్ట‌నున్నారు.

180 మిల్లీ లీట‌ర్ల బాటిల్‌పై రూ. 10,

375 మి.లీ. బాటిల్‌పై రూ. 20,

90 మి.లీ. బాటిల్‌పై రూ. 10,

750 మి.లీ. బాటిల్‌పై రూ. 40 త‌గ్గించారు.

కొన్ని రకాల బ్రాండ్స్‌ ఫుల్‌ బాటిల్స్‌పై రూ. 60 వరకు తగ్గించినట్లు ఆబ్కార్‌ అధికారులు వెల్లడించారు. అయితే బీరు ధ‌ర‌ల‌ను మాత్రం త‌గ్గించ‌లేదు.

అయితే త‌గ్గిన మ‌ద్యం ధ‌ర‌లు శుక్ర‌వారం నుంచే అమ‌ల్లోకి రానున్నాయి. అధిక ధ‌ర‌ల కార‌ణంగా తెలంగాణ‌లోకి అక్ర‌మంగా మ‌ద్యం ప్ర‌వేశిస్తున్న‌ట్లు అబ్కారీ అధికారుల దృష్టికి వ‌చ్చింది. అక్ర‌మ మ‌ద్యం ర‌వాణాను నివారించేందుకే మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

Latest News