Site icon vidhaatha

హిప్పోపొట‌మ‌స్ దెబ్బ‌కు సింహాలు ప‌రార్.. వైర‌ల్ వీడియో

Viral Video | అడ‌వికి రారాజు ఎవ‌రంటే సింహాం( Lion ) అని చెప్పేస్తారు. మ‌రి సింహాన్ని చూస్తే మిగ‌తా జంతువుల‌న్నీ త‌ప్పించుకుపోతాయి. ఒక వేళ సింహాం కంట ప‌డితే ఆ జీవి ప్రాణాలు ఖ‌తం అవ్వాల్సిందే. అంత‌టి క్రూర‌మైన సింహాల‌ను హిప్పోపొట‌మ‌స్( Hippopotamus ) (నీటి ఏనుగు) చుక్క‌లు చూపించింది.

ఓ చెరువులో హిప్పోపొట‌మ‌స్‌లు సేద‌తీరుతూ ఉన్నాయి. నీళ్లు తాగేందుకు ఓ మూడు సింహాలు కూడా ఆ చెరువు వ‌ద్ద‌కు వ‌చ్చాయి. హిప్పోపొట‌మ‌స్‌ను చూసిన సింహాం న‌క్కిన‌క్కి నీళ్లు తాగేందుకు య‌త్నించింది. సింహాం బ‌ల‌హీన‌త‌ను ప‌సిగ‌ట్టిన నీటి ఏనుగు.. దానిపై దాడి చేసేందుకు ముందుకు క‌దిలింది.

ఇంకేముంది అక్క‌డ్నుంచి ఆ సింహాంతో పాటు మ‌రో రెండు ప‌రార్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న ద‌క్షిణాఫ్రికాలోని క‌పామా ప్ర‌యివేటు గేమ్ రిజ‌ర్వ్‌లో చోటు చేసుకుంది.

Exit mobile version