Site icon vidhaatha

Apple BKC | యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌ కుక్‌.. సీఈవోను సర్‌ప్రైజ్‌ చేసిన అభిమాని..!

Apple BKC | భారత్‌లో ఐఫోన్ల కంపెనీ యాపిల్‌ బీకేజీ తన రిటైల్‌ స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ ముంబయిలోని బాంద్రా కుర్లాలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో ప్రారంభించారు. స్టోర్‌ గేట్లు ఓపెన్‌ చేసి టిమ్‌ కుక్‌ వినియోగదారులకు ఘన స్వాగతం పలికారు. దేశీయ మొబైల్‌ మార్కెట్లోకి అడుగుపెట్టి 25 ఏండ్లు పూర్తిచేసుకున్న యాపిల్‌ సంస్థ.. దేశీయ మార్కెట్‌లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో యాపిల్‌ స్టోర్లను ప్రారంభించింది.

భారత్‌లో సంస్కృతితోపాటు అద్భుతమైన శక్తిదాగి ఉందని, కస్టమర్టకు దీర్ఘకాలికంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. ఇక ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లోనూ రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను సంస్థ లాంఛ్‌ చేయనుంది. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఏప్రిల్‌ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది.

టిమ్ కుక్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన అభిమాని

యాపిల్ స్టోర్ ఇవాళ ముంబయిలో ప్రారంభించింది. కార్యక్రమానికి ఓ వ్యక్తి తన వద్ద ఉన్న వింటేజ్ యాపిల్ కంప్యూట‌ర్‌ను తీసుకువచ్చాడు. యాపిల్ యూజ‌ర్ టిమ్‌ కుక్‌ను కలిశారు. 1984 నాటి ఆ యాపిల్ కంప్యూట‌ర్‌ను చూసి టిమ్ కుక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాపిల్ జ‌ర్నీ ఎలా సాగిందో తెలిపేందుకు తాను త‌న వ‌ద్ద ఉన్న వింటేజ్ యాపిల్ కంప్యూటర్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు సదరు వ్యక్తి తెలిపాడు.

1984 నాటి యాపిల్ కంప్యూట‌ర్‌ను చూసి కుక్‌ సంతోషం వ్యక్తం చేశారు. 1984 నుంచి యాపిల్ ఉత్పత్తులు వాడుతున్నానని, ఇది 2 మెగాబైట్స్ బ్లాక్ అండ్ వైట్ కంప్యూట‌ర్ అని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు యాపిల్ సంస్థ 4కే, 8కే రెజ‌ల్యూష‌న్ డిస్‌ప్లేలు తయారు చేస్తోందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

Exit mobile version