Site icon vidhaatha

Viral Video | అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు తప్పిన ముప్పు..!

Argentina | ఫిపా వరల్డ్‌ కప్‌ను గెలిచిన ఆనందంలో అర్జెంటీనాలో సంబురాలు జరుగుతున్నాయి. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు అభిమానులతో కలిసి సంబురాలు పాల్గొంటున్నారు. సంబురాల్లో పాల్గొన్న జట్టు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మెస్సీతో సహా కీలక ఆటగాళ్లు ప్రమాదం నుంచి గట్టెక్కారు. విజయోత్సవ వేడుకల్లో ఫుట్‌బాల్‌ జట్టు పాల్గొన్నది. ఈ క్రమంలో బస్‌లో పర్యటిస్తున్న సమయంలో పలువురు మెస్సీ సహా ఐదుగురు ఆటగాళ్లు ట్రోఫీతో బస్‌టాప్‌పై కూర్చుకొని అభిమానులను ఉత్సాహపరిచారు.

ఇలా బస్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆటగాళ్లకు కరెంటు తీగ అడ్డుగా వచ్చింది. మొదట్లో ఎవరూ గమనించలేదు కానీ.. తీగల దగ్గరకు వచ్చిన తర్వాత ఓ ఆటగాడు గమనించి మిగతా అందరినీ అప్రమత్తం చేయడంతో అందరూ కిందకు వంగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, కరెంటు షాక్‌ తగిలే ప్రమాదం లేకపోయినా.. వైర్లు తగిలితే బస్సు నుంచి కిందపడిపోయే ప్రమాదం ఉండేది. ఇందుకు సంబంధించిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం జరిగిన ఫిపా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి అర్జెంటనీ కప్‌ను ఎగురేసుకొనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 30 సంవత్సరాల తర్వాత దేశం కప్‌ను గెలువడంతో ఆ దేశంలో సంబురాలు మిన్నంటాయి.

Exit mobile version