Karnataka | దొంగలు సాధారణంగా.. డబ్బు, బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు. కానీ ఈ దొంగ మాత్రం అందుకు భిన్నంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మహిళల లోదుస్తులు దొంగిలించడం వ్యసనంగా మార్చుకున్నాడు. ఆ లోదుస్తులను ధరించి ఆ అనుభూతి పొందుతున్నాడట. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అముల్(23) అనే యువకుడు బెంగళూరులోని హెబ్బగోడి ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే స్థానికంగా ఉన్న నివాసాల్లో అముల్ వరుసగా చోరీలకు పాల్పడుతున్నాడు. రాత్రి వేళ బాల్కనీలు, పెరట్లోకి ప్రవేశించి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.
బాధిత మహిళల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అముల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నివాసాన్ని పరిశీలించగా, ఇంట్లో కుప్పలు తెప్పలుగా మహిళల లోదుస్తులను చూసి పోలీసులు షాకయ్యారు. కొన్ని సందర్భాల్లో ఆ లోదుస్తులను ధరించి శృంగార అనుభూతి పొందేవాడట. లోదుస్తులు ధరించిన వీడియోలు కూడా అముల్ ఫోన్‌లో లభ్యమయ్యాయి.
మహిళల లోదుస్తులను దొంగిలించి ధరించడం తనకు అలవాటుగా మారిందని పోలీసుల విచారణలో అముల్ అంగీకరించాడు. అలా చేయడం వల్ల తనకు ఒక రకమైన వ్యసనంగా మారిందని, అందుకే పదేపదే ఈ పని చేస్తున్నానని చెప్పాడు. అముల్‌పై ఐపీసీ సెక్షన్ 303(2) (దొంగతనం), 329(4) (ఇంట్లోకి చొరబడటం) 79 (మాటలు, సంజ్ఞలు లేదా చొరబాటు ద్వారా అభ్యంతరకరమైన చర్య) కింద కేసు నమోదు చేశారు.
