విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. ఈ హెలికాప్టర్ వసతిని రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టింది. హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు తిరిగి మేడారం నుండి హనుమకొండకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్ ను ఖరారు చేశారు.
హెలికాఫ్టర్ వసతిని ప్రారంభించిన మంత్రి
ఈ హెలికాఫ్టర్ వసతిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు, ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్ పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు.
గురువారం ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థవారు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ వసతి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు.
థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది.బుకింగ్ వివరాలు:
ఫోన్: 9676320139, 8530004309, 7660939509
వెబ్‌సైట్: www.helitaxii.com
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Shamshabad Lagacharla Road | శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!
