కదిలే ట్రక్కుల మధ్య పుల్-అప్స్‌.. ఆర్మేనియన్ యువకుడి ప్రపంచ రికార్డు

విజేత‌లు ఎప్పుడూ భిన్న‌మైన ప‌నులు చేయ‌రు.. ప‌నుల‌నే భిన్నంగా చేస్తారు. జిమ్‌ల‌లో ఉద‌యం వేళ ఫుల్‌-అప్స్ చేయ‌డం సాధార‌ణం

  • Publish Date - December 20, 2023 / 08:51 AM IST

విధాత‌: విజేత‌లు ఎప్పుడూ భిన్న‌మైన ప‌నులు చేయ‌రు.. ప‌నుల‌నే భిన్నంగా చేస్తారు. జిమ్‌ల‌లో ఉద‌యం వేళ ఫుల్‌-అప్స్ చేయ‌డం సాధార‌ణం. కానీ, రెండు కదులుతున్న ట్రక్కుల మధ్య ఉంచిన బార్‌పై పుల్‌-అప్స్ చేయ‌డం అసాధార‌ణం. అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సాధించాడు ఓ యువ‌కుడు.


ఆ ఫీట్ ఎలా సాధించాడంటే..


18 ఏండ్ల ఆర్మేనియన్ యువకుడు గ్రిగోర్ మానుక్యాన్.. రెండు కదిలే ట్రక్కుల మధ్య బిగించిన‌ బార్‌పై 44 పుల్-అప్స్ చేశాడు. ఈ ప్రదర్శించడం త‌న అద్భుతమైన శరీర బలాన్ని ప్రదర్శించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం.. ట్రక్కులు క‌నిష్ఠంగా 5 km/h (3.1 mph) వేగాన్ని కలిగి ఉండాలి. వాహ‌నాలు ఆ స్పీడ్‌లో వెళ్తుంగా గ్రిగర్ పడిపోకుండా వీలైనన్ని ఎక్కువ పుల్-అప్‌లు చేశాడు. “ది ఇటాలియన్ బటర్‌ఫ్లై” టాజియో గావియోలీ నెల‌కొల్పిన‌ 35 సంఖ్య‌ రికార్డును బద్దలు కొట్టాడు. తాను 50 పుల్‌-అఫ్స్ తీయాలనుకున్నాని కానీ, 44 ద‌గ్గ‌ర ఆపివేశార‌ని గ్రిగోర్ తెలిపారు

Latest News