Viral Video | మెర్సిడెస్ బెంజ్ కారును ఆటో డ్రైవర్ కాలితో తోసుకెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి. మీరు చదువుతున్నది నిజమే. వేగంగా వెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ కారు రద్దీగా ఉన్న రహదారిపై ఆగిపోయింది. ఏం చేయాలో డ్రైవర్‌కు తోచలేదు.
కానీ అక్కడున్న ఆటో డ్రైవర్‌కు తక్షణమే ఆలోచన తట్టింది. బైక్‌లు, ఆటోలు రోడ్లపై ఆగిపోతే.. వాటిని కాలితో తోసుకెళ్లే విషయం ఆ ఆటో డ్రైవర్‌కు గుర్తొచ్చింది. ఇంకేముంది అదే సూత్రాన్ని మెర్సిడెస్ బెంజ్ కారు విషయంలో కూడా ఉపయోగించాడు. ఆ కారును కాలితో తోసుకుంటూ.. షెడ్డు దాకా తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర పుణెలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలో ఓ మెర్సిడెస్ బెంజ్ కారు వేగంగా వెళ్తుంది. అంతలోనే బ్రేక్ డౌన్ కావడంతో రద్దీగా ఉన్న రహదారిపై ఆగిపోయింది ఆ బెంజ్ కారు. ఇక డ్రైవర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని అటు ఇటు చూశాడు. ఆగిపోయి ఉన్న బెంజ్ కారును చూసి ఓ ఆటో డ్రైవర్ ఆగిపోయాడు. విషయం తెలుసుకున్న ఆ డ్రైవర్.. బెంజ్ కారు డ్రైవర్‌కు సాయం చేశాడు. తన ఆటోను నడుపుతూ.. మరో కాలితో బెంజ్ కారును తోసుకుంటూ షెడ్డు దాకా తీసుకెళ్లాడు.
ఇక బెంజ్ కారును ఆటో డ్రైవర్ కాలితో తోసుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆటో డ్రైవర్ ను మెచ్చుకుంటూ నెజిటన్లు కామెంట్లు చేస్తున్నారు.
Viral | మెర్సిడెస్ బెంజ్ కారును కాలితో తోసుకెళ్లిన ఆటో డ్రైవర్.. https://t.co/tVUmuxNmC9 pic.twitter.com/YAZEyAlfRK
— vidhaathanews (@vidhaathanews) December 17, 2022