Shobu Yarlagadda | పేరు చెప్పకుండా.. ఆ హీరోకి తలంటేశాడు! ఇకనైనా మారతాడా?

<p>Shobu Yarlagadda విధాత‌: ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది ఒకప్పటి మాట.. మరిప్పుడో చిన్న విజయానికే తల పొగరు ఎక్కి ప్రవర్తించడం అనేది పరిపాటి అయిపోయింది. మనిషి ఒదిగితే ఆకాశానికి ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అదే తలెగరేస్తే పాతాళానికి పడిపోవడమే అవుతుంది. పెద్దలు చెప్పే ఈ నీతుల్లో చాలా సత్యం దాగుందని దానిని ఫేస్ చేసిన వారికే తెలుస్తుంది. ఈ విషయంలో మిగతా జనాలేమో గానీ సినీ జనాలకు సరిగ్గా ఈ పోలిక సరిపోతుంది. చిన్న […]</p>

Shobu Yarlagadda

విధాత‌: ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది ఒకప్పటి మాట.. మరిప్పుడో చిన్న విజయానికే తల పొగరు ఎక్కి ప్రవర్తించడం అనేది పరిపాటి అయిపోయింది. మనిషి ఒదిగితే ఆకాశానికి ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అదే తలెగరేస్తే పాతాళానికి పడిపోవడమే అవుతుంది. పెద్దలు చెప్పే ఈ నీతుల్లో చాలా సత్యం దాగుందని దానిని ఫేస్ చేసిన వారికే తెలుస్తుంది.

ఈ విషయంలో మిగతా జనాలేమో గానీ సినీ జనాలకు సరిగ్గా ఈ పోలిక సరిపోతుంది. చిన్న సక్సస్ చూడగానే తలెగరేసి గర్వంతో తమ దగ్గరకు వచ్చే ఛాన్స్ లను కాలదన్నుకుంటారు కొందరు. ఇది మంచి పరిణామం కాదని జీవితం తల్లకిందులయ్యాకా కానీ తెలీదు.

ఇక బాహుబలి సినిమా నిర్మాత వ్యక్తిపరంగా చాలా సాఫ్ట్.. అలాంటి వాడికి కూడా ఓ హీరో చేసిన పని కోపాన్ని తెప్పించింది. ఆ హీరోని.. హీరో పేరు చెప్పకుండా ఇన్‌డైరెక్ట్‌గా తలంటేశాడు. తన పద్దతి మార్చుకోక పోతే పాతాళానికి పడి పోతావనే హింట్ కూడా ఇచ్చాడు. ఇంతకీ అతగాడు ఎవరనేది చెప్పకుండానే చెప్పినట్లయింది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఎవరి గురించి అనేది చెప్పకుండా ట్వీట్ చేసి.. కాసేపటికే డిలీట్ చేశాడు.

అయితే శోభు ఎవరిని గురించే ట్వీట్ చేసాడో తెలియక పోయినా ఆ హీరోకు సక్సెస్ తలకు ఎక్కేసి ప్రవర్తిస్తున్నాడని, డెబ్యూ డైరెక్టర్ కథ చెప్పబోతే అతడిని అవమానించాడని మాత్రం రాసుకొచ్చాడు. విజయాన్ని నిలుపుకోవడం అనేది అందరికీ తెలిసిన విద్య కాదనే మాటతో శోభు యార్లగడ్డ గట్టిగానే చెళ్ళుమనిపించాడు.

ఇక గత కొంత కాలంగా ప్రతి వివాదంలోనూ తనదైన తలబిరుసును చూపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు విశ్వక్ సేన్, ఈమధ్య సూపర్ హిట్ కొట్టిన చిన్న సినిమా ‘బేబీ’ ఇప్పుడు బంపర్ కలెక్షన్స్‌తో హిట్ ట్రాక్ మీద ఉంది. అయితే ఈ సినిమా కథ మొదట విశ్వక్ దగ్గరకు వస్తే సరిగా కథ వినకుండా పంపేశాడట. ఈ కథ వినడానికి చూడలేదనే చర్చకు సినిమా ఒప్పకోవడం ఒప్పుకోకపోవడం నా ఇష్టం అంటూ ప్రతి వాదనకు దిగాడు విశ్వక్.

అలాగే హీరో అర్జున్ సినిమాలోనూ ఇలాంటి దురుసు ప్రవర్తనతో ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇలా ప్రతి విషయంలోనూ గర్వాన్ని చూపిస్తూ ఏదోలా వివాదాల్లో ఉంటున్నాడు విశ్వక్. ఇక ఇతని గురించే శోభూ యార్లగడ్డ అన్నాడని చెప్పకనే చెబుతున్నట్టేగా.. విషయం ఏదైనా కాస్త నిదానంగా ఉండటం అందరికీ మంచిది. మరి ఈ సంగతి విశ్వక్ సేన్ కి ఎవరు చెబుతారో..